అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాదికి కోర్టు షాక్ ఇచ్చింది.మూడేళ్ళ జైలు శిక్షని విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.
వివరాలలోకి వెళ్తే.ట్రంప్ మాజీ న్యాయవాది అయిన మైఖెల్ కొహెన్‌కు న్యూయార్క్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది…దాంతో ఈ వార్తా సంచలనం సృష్టిస్తోంది.అయితే
ట్రంప్‌తో తమకు అఫైర్ ఉందంటూ వెల్లడించిన ఇద్దరు మహిళలకు కొహెన్ భారీ మొత్తం చెల్లించడం ద్వారా ప్రచార వ్యయ నిబంధనలు ఉల్లంఘించడం తదితర ఆరోపణలు రుజువు కావడంతో న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
అయితే అధ్యక్షుడి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో తానూ చేపట్టిన చర్యలకి పూర్తి భాద్యతని వహిస్తున్నట్టుగా ఆయన కోర్టుకు తెలిపారు.మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంభందించి కూడా కొహెన్‌ను రెండు నెలల కష్టడీకి ఆదేసిందింది.
.తాజా వార్తలు