అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్కకి లెక్క లేదు.ఎప్పటికప్పుడు తన తిక్క పనులు ద్వారా ట్రంప్ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటాడు.
ట్రంప్ తిక్కకి మరో పరాకాష్టగా మారింది తాజాగా జరిగిన ఒక సంఘటన.అమెరికా ప్రభుత్వంలో కీలాక అధికారి అయిన అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పై వేటు వేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తు అంశం గురించి గత కొన్నినెలలుగా జెఫ్ సెషన్స్ ట్రంప్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
దాంతో ఆయనపై గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న ట్రంప్ గురువారం జెఫ్ సెషన్స్‌ను తన పదవి నుంచి తప్పించారు.తాత్కాలిక అటార్నీ జనరల్‌గా ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్థుడైన మాథ్యూ జీ వైటేకర్‌ను నియమించారని తెలుస్తోంది.ఈ మేరకు ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్‌గా మాథ్యూ జీ వైటేకర్‌ను నియమిస్తున్నాం.నేటి నుంచి ఆయన తన సేవలను అందిస్తారు త్వరలోనే కొత్త అటార్నీ జనరల్‌ను నియమిస్తాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.గతంలో పని చేసిన జెఫ్ సెషన్స్ కి ధన్యవాదాలు తెలిపారు.అయితే ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ప్రజలు సైతం విమర్శించడం కొసమెరుపు.