ట్రంప్ సర్కార్ వలసదారులపై మరో పిడుగు వేయడానికి సిద్దంగా ఉందట.సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వం ద్వారా వలసదారులకి ఇచ్చే హౌసింగ్ వోచర్ల సాయం పొందుతున్న వలసదారులకు గ్రీన్కార్డుల్ని(శాశ్వత నివాసం) ఇచ్చే ఆలోచన విరమించేలా చట్టం రూపొందించాలని అనుకుంటోంది అయితే ఈ చట్టం గనుకా కార్యరూపం దాల్చితే అమెరికాలో ఉంటున్న కొంతమంది భారతీయులపై తీవ్రమైన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అయితే ఈ నిభంధనపై ఇప్పటికే హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి సంతకం చేశారు.ఇక నిర్ణయం తీసుకోవలసింది క్యాబినెట్ మరియు సెనెట్ సభ్యులే.ఇదిలావుంటే నివాస మార్పు లేదా వీసా కోరుకునేవారు.అలాగే అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వలసదారులు.ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని నిరూపించుకోవాలి అలా ఉంటేనే వారికి గ్రీన్ కార్డ్ దక్కేలా ప్రణాలికలు రూపొందిస్తున్నారు.
ఇదిలాఉంటే కొత్తగా ఎవరైనా గ్రీన్ కార్డ్ గనుకా పొందాలి అంటే వారందరూ ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని ఆశించకూడదని నిభందన విధించారు అంతేకాదు మరొక దారుణమైన విషయం ఏమిటింటే కేవలం ఆహరం నగదే కాక మెడికేర్ కింద తక్కువ ఖర్చుతో మందులు అందుకుంటోన్న వలసదారులకు సైతం గ్రీన్ కార్డు నిరాకరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.మరి ఈ నిభంధనలని ఎంతవరకూ సెనేట్ ఆమోదిస్తుందో వచ్చి చూడాలి.