భారతదేశంలో భారతీయుల గొప్పదనాన్ని, పౌరుషాన్ని ,పొగరుని ,శాంతికాముకతని ప్రపంచానికి తెలియచెప్పిన జాతి పిత మహత్మా గాంధీ…ప్రపంచానికే ఆదర్శ ప్రాయుడు అయ్యాడు.గాంధీజీ సిద్దంతాలు ప్రపంచం అంతా ఫాలో అవుతోంది అంటే ఆయన అడుగు జాడల్లో నడవాలని విద్యార్ధుల పుస్తకాల్లో సైతం లిఖించబడింది అంటే దానికి కారణం ఆయన చూపించిన గొప్ప మార్గమే.అయితే
గాంధీజీ ఎప్పుడూ నూలు వడికే రాట్నాన్ని ఎంతో ప్రేమించే వారు సమయం దొరికిన ప్రతీ సారి ఆ రాట్నం దగ్గర గడిపేవారు అయితే ఈ రాట్నం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ జాతిపిత రాసిన లేఖ ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టించింది ఈ లేఖ వేలంలో 6,358 డాలర్లు గెలుపొందింది.అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4.5 లక్షలు అయితే గాంధీజీ ఈ లేఖని ఎవరికీ రాశారు ఎక్కడి దొరికింది అంటే.
బాపుజీ ఆశీర్వాదాలతో అనే సంతకంతో ఉన్న ఈ లేఖ.గాంధీజీ యశ్వంత్‌ప్రసాద్ అనే వ్యక్తికి రాశారు.గుజరాతీ భాషలో ఉన్న లేఖపై సంవత్సరం, తేదీ లేదని అమెరికాకు చెందిన నిర్వాహకసంస్థ ఆర్‌ఆర్ ఆక్షన్ తెలిపింది.మనం ఊహించినట్లుగానే నూలు మిల్లులు వచ్చాయి.అయితే, మీరు చెప్పింది నిజమే.అంతా మగ్గం మీదే ఆధారపడి ఉంది అని మహాత్ముడు ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ లేఖలో మర్మం ఏమిటనేది తెలుసుకునే పనిలో పడ్డారు చరిత్రకారులు.
.