మొన్నటి వరకు రేవంత్‌రెడ్డి ఎన్ని కామెంట్లు చేసినా పెద్దగా పట్టించుకోని టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు కాస్త తడబడుతున్నారు.ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా రేవంత్‌రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా చేయడంతో ఇప్పుడు ఆయన టార్గెట్ మొత్తం టీఆర్ ఎస్మీదనే పెట్టారు.
మొదటి నుంచి టీఆర్ ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా ఒంటికాలిపై లేస్తున్న రేవంత్‌కు ఇప్పుడు గట్టి పట్టు దొరికినట్టు అయిపోయింది.దాంతో ఆయన వరుసగా సంచలన ఆరోపణలు చేస్తూ టీఆర్ ఎస్‌కు నిద్రలేకుండా చేస్తున్నారు.
ఇక ఎప్పటికైనా రేవంత్‌తో ముప్పు తప్పదని గ్రహించిన టీఆర్ ఎస్ అధిష్టానం ఆయనకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది.ఇందుకోసం రేవంత్ చేస్తున్న విమర్శలను ఆధారంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలతోనే చెక్ పెడుతోంది.
రేవంత్ కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్లోచేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని చేసిన వ్యాఖ్యలపై ఆ ఎమ్మెల్యేలతోనే చెప్పుతో కొడతామని సమాధాంన చెప్పించిన టీఆర్ ఎస్ ఇప్పుడు మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలతోనే రేవంత్‌కు కౌంటర్లు వేయిస్తోంది.
కానీ రేవంత్‌పై మంత్రులు గానీ కేసీఆర్ గానీ పెద్దగా స్పందించట్లేదు.కనీసం ఆయన్ను తాము లెక్కలోకి కూడా తీసుకోవట్లేదని ఇంటిమేషన్లు ఇస్తున్నారు.అంటే రేవంత్‌పై ఎమ్మెల్యేలతోనే విమర్శలు చేయిస్తూ ఆయన స్థాయిని తగ్గించేందుకు చూస్తున్నారు కేసీఆర్.
ఇక ఓటుకునోటు కేసు ఎలాగూ పెద్ద అస్త్రంగా టీఆర్ ఎస్‌కు ఉంది.దీన్ని వాడేసుకుంటున్న టీఆర్ ఎస్ అధిష్టానం కాంగ్రెస్ లో రేవంత్‌పై ఉన్న వ్యతిరేకతను కూడా వాడేసుకుంటుంది.
ఇప్పటికే కొందర్ని కేసీఆర్ కాంగ్రెస్‌లో ప్రోత్సహిస్తున్నట్టు కూడా చర్చలు జరుగుతున్నాయి.ఇక రేవంత్ కు ఎలాగూ సీనియర్ల సెగ తగులుతూనే ఉంది.
వీరిని కూడా కేసీఆర్ ప్లాన్ ప్రకారం వాడుకునే అవకాశం ఉంది.మరి టీఆర్ ఎస్ వేస్తున్న స్కెచ్‌లో రేవంత్ చిక్కుకుంటారా లేదా అన్నది చూడాల్సిందే.