రాజమౌళి కంటే త్రివిక్రమ్ సంపాదన ఎక్కువా.. ఆ పని చేసి రూ.కోట్లు సంపాదిస్తున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు రాజమౌళి ( Rajamouli ) పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.ఈ డైరెక్టర్ ప్రతి సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని ఈ విధంగా తీసుకోవడం వల్ల జక్కన్న సంపాదన ఊహలకు అందని స్థాయిలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

 Trivikram Income More Than Rajamouli Income Details Here Goes Viral In Social Me-TeluguStop.com

అయితే జక్కన్న నాలుగేళ్లకు ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాలకు సంబంధించి ఏవైనా ఆవాంతరాలు ఏర్పడితే ఆ సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి.

అయితే రాజమౌళి సంపాదనతో పోల్చి చూస్తే త్రివిక్రమ్( Trivikram ) సంపాదన ఎక్కువగా ఉందని తెలుస్తోంది.త్రివిక్రమ్ తన తెలివితో కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు డైరెక్టర్ గా 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

Telugu Guntur Kaaram, Pawan Kalyan, Rajamouli, Tollywood, Trivikram-Movie

మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan సినిమాలకు సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ తీసుకుంటున్నారు.కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేస్తున్న త్రివిక్రమ్, పవన్ కు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను సైతం సెట్ చేస్తున్నారు.పవన్ సినిమాల డైరెక్టర్ల ఎంపికకు సంబంధించి కూడా త్రివిక్రమ్ జోక్యం చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మరోవైపు త్రివిక్రమ్ పలు యాడ్స్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Guntur Kaaram, Pawan Kalyan, Rajamouli, Tollywood, Trivikram-Movie

త్రివిక్రమ్ సొంత బ్యానర్ సితార( Sithara Entertainmen ) ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండటం గమనార్హం.త్రివిక్రమ్ ప్లానింగ్ వేరే లెవెల్ అని ఆయన ఎదిగిన తీరు అమోఘం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం( Guntur karam ) సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా త్రివిక్రమ్ కు భారీ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube