నకిలీ డాక్యుమెంట్లు , వీసా కేసు : అప్పటి వరకు కెనడా కస్టడీలోనే భారతీయ ట్రావెల్ ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా

నకిలీ విద్యార్ధి వీసాలు, అడ్మిషన్ లెటర్స్‌ కుంభకోణానికి గాను భారత్‌లోని పంజాబ్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రాను( Brijesh Mishra ) కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతని విచారణ ప్రారంభమయ్యే వరకు ఫెడరల్ కస్టడీలోనే వుండనున్నాడు.

 Travel Agent Brijesh Mishra To Remain In Canada Federal Custody Till Trial In Fo-TeluguStop.com

కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) కొంతమంది మాజీ విద్యార్ధులకు రాసిన లేఖ ప్రకారం.బ్రిజేష్ మిశ్రా వాంకోవర్‌లోని హోల్డింగ్ ఫెసిలిటీలో( Vancouver ) నిర్బంధానికి అంగీకరించాడు.

అతని కేసు ఫిబ్రవరి 9, 2024న విచారణకు రానుంది.బ్రిజేష్ మిశ్రాపై ఐదు అభియోగాలను నమోదు చేయగా.

అతనికి కోర్ట్ బెయిల్‌ను నిరాకరించింది.

బాధితుల్లో ఒకరైన కరమ్‌జిత్ కౌర్‌కు( Karamjit Kaur ) సంబంధించిన అడ్మిసిబిలిటీ కేసు విచారణలో నవంబర్ 1న బ్రిజేష్ మిశ్రా వీడియో లింక్ ద్వారా .టొరంటోలోని ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరయ్యాడు.తాను ఆగస్ట్ 2019 వరకు ఆస్ట్రేలియాలోని( Australia ) ఉన్నత విద్యాసంస్థల కోసం విద్యార్ధులను రిక్రూట్ చేయడంలో మాత్రమే పాల్గొన్నట్లు మిశ్రా పేర్కొన్నాడు.ఈ సందర్భంగా తనపై నమోదు చేసిన అన్ని ఆరోపణలను తిరస్కరించాడు.285కి పైగా యాక్టీవ్ కేసులున్నప్పటికీ సీబీఎస్ఏ తమ దర్యాప్తులో వెలికితీసిన అంశాల్లో తన ప్రమేయం లేదని మిశ్రా స్పష్టం చేశాడు.

Telugu Australia, Brijesh Mishra, Canada, Canadaagency, Scam, Karamjit Kaur, Van

కాగా.ఈ ఏడాది ప్రారంభంలో నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.అంతేకాదు.

భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.

Telugu Australia, Brijesh Mishra, Canada, Canadaagency, Scam, Karamjit Kaur, Van

ఇమ్మిగ్రేషన్ స్కామ్‌లో( immigration scam ) పంజాబ్‌కు చెందిన విద్యార్ధులే ఎక్కువ.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.విద్యార్ధులను తప్పుదోవ పట్టించిన వారు, మోసం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube