ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ హైకోర్టులో ఏజీ వాదనలు వినిపించారు.ఈ క్రమంలో ఏజీ వాదనలకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సమాధానం ఇచ్చారు.
దీనిపై శుక్రవారం నాటికి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.