హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ముగ్గురు సీఐలపై బదిలీ వేటు పడింది.ఈ మేరకు సైదాబాద్ సీఐ రవి, హుస్సేనిఆలం సీఐ నాగేశ్వర్ రెడ్డి, మీర్ చౌక్ సీఐ ఆనంద్ ను బదిలీ చేస్తై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం, శాంతిభద్రతలు కాపాడలేకపోవడంలో సీఐలు విఫలం అయ్యారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.అసమర్థతో పాటు కేసులను ఛేదించకపోవడం మరియు రోజువారీ స్టేషన్ డ్యూటీ మెంటైన్ చేయకపోవడంతో ముగ్గురిపై బదిలీ వేటు వేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.