పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిలో విషాదం నెలకొంది.ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలోనే ఉదయం గుండెపోటుకు గురై చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
విష్ణువర్ధన్ రెడ్డి మృతిపై బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు.