హీరోల లోపాలే సినిమాలకు వరమా.. ఆ పాత్రల్లో నటించి హిట్లు అందుకున్న స్టార్స్ వీళ్లే?

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ మధ్య కాలంలో కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలు మాత్రమే నచ్చుతున్నాయి.రొటీన్ కథలను, మాస్  కథలను ప్రేక్షకులు హిట్ చేయడం లేదు.

 Top Tollywood Movies That Heroes Suffering From Disease , Suffering Diseases ,-TeluguStop.com

స్టార్ హీరోలు నటించినా కొత్త తరహా కథాంశం లేని సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్ చేస్తుండటం గమనార్హం.అయితే దర్శకులు ఈ మధ్య కాలంలో హీరోల పాత్రలకు ఏదో ఒక లోపం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నాయి.కొన్నేళ్ల క్రితం వరకు హీరోలు కూడా తమ పాత్రలకు లోపాలు ఉంటే అస్సలు అంగీకరించే వారు కాదు.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుండటం గమనార్హం.గతేడాది విడుదలైన సినిమాల్లో పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

షోల్డర్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఉన్న వ్యక్తిగా బన్నీ పుష్ప ది రైజ్ సినిమాలో నటించారు.

ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.మహానుభావుడు సినిమాలో ఓసీడీతో బాధ పడే పాత్రలో శర్వానంద్ నటించి ఆకట్టుకున్నారు.జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నత్తితో మాట్లాడటానికి ఇబ్బంది పడే జై పాత్రలో కనిపించి మెప్పించారు.భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరపు పాత్రలో నాని అద్భుతంగా నటించడం గమనార్హం.

ఊపిరి సినిమాలో కింగ్ నాగార్జున వీల్ చైర్ కు పరిమితమైన పాత్రలో నటించి మెప్పించారు.

Top Tollywood Movies That Heroes Suffering From Disease

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube