ఆ టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ హీరోల‌కు ప‌డ‌ట్లేదా.. ఆ ఇద్ద‌రు హీరోల కోల్డ్‌వార్‌...!

టాలీవుడ్‌లో ఓ బ‌డా ఫ్యామిలీలో ఇద్ద‌రు క్రేజీ హీరోల మ‌ధ్య కోల్డ్‌వార్ రోజు రోజుకు ముదురుతోన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఆ ఫ్యామిలీ హీరోల‌దే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో రాజ్యం.

 Tollywood Top Hero Families Cold War,tollywood,heroes,cold War,movie,media,group-TeluguStop.com

వారు తీస్తోన్న సినిమాలే వ‌రుస‌గా రిలీజ్ అవుతున్నాయి.ఇప్ప‌టికే వ‌చ్చిన హీరోలు కాకుండా మ‌రి కొంత మంది ఆ ఫ్యామిలీ నుంచి వెండితెరంగ్రేటం చేసేందుకు రెడీగా ఉన్నారు.

ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ ఫ్యామిలీలో ఓ హీరో వ్య‌వ‌హార శైలీ ఇప్పుడు అంద‌రికి చికాకుగా మారిందంటున్నారు.

స‌ద‌రు హీరో అస‌లు కాస్త స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన వెంట‌నే త‌న‌కంటూ స‌ప‌రేట్ ఫ్యాన్స్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు తాను ఎవ్వ‌రి వ‌ల్లా పైకి రాలేద‌ని.తాను క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాన‌ని చెప్పుకుంటున్నాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఇవి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే ఎక్కువ వినిపిస్తున్నాయి.ఇక మ‌రో సీనియ‌ర్ హీరో, రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడి విష‌యంలో కూడా స‌ద‌రు హీరో ప‌బ్లిక్‌గానే రెండు మూడు సార్లు చెప్ప‌నంటూ మాట్లాడిన మాట‌లు కూడా తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఇక ఈ యేడాది స‌ద‌రు హీరో ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు.దీంతో స‌ద‌రు హీరోకు ఆర్మీలు అంటూ కొత్త ఫ్యాన్స్ గ్రూపులు క్రియేట్ అయ్యాయి.

ఇక స‌ద‌రు హిట్ త‌ర్వాత ఆ హీరో ఆర్మీలు ఇది త‌మ హీరో క్రెడిట్ అని… త‌మ హీరోకు మాత్ర‌మే తాము అభిమానులం అన్న క్యాంపెయిన్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయ్యింది.ఇక ఆ హీరో ఫ్యామిలీ పెద్దాయ‌న‌ కూడా మ‌రో యంగ్ హీరోకు వ‌చ్చిన క‌థ‌ల‌ను ఆ హీరోకు మ‌ళ్లించ‌డంతో ఆయ‌న రెండు హిట్లు కొట్టారు.

ఈ ప‌రిణామాలు అన్ని ఆ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెంచాయంటున్నారు.

ఇక తాను న‌టిస్తోన్న డైరెక్ట‌ర్‌తో ఆ దూకుడు హీరో నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ చేసేశాడు.

ఇది కూడా వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌న‌కు మ‌రింత కార‌ణ‌మైందంటున్నారు. ఈ ఇద్ద‌రు హీరోల ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం వాళ్లే వీళ్ల ఫ్యామిలీల్లో కూడా తెలియ‌ని గ్యాప్ ఏర్ప‌డింద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube