గోర్లు సహజంగా పెరగాలంటే ఇంటి చిట్కాలు

గోర్లు తొందరగా చిట్లి పోతున్నాయా? గోర్లలో త్వరగా పెరుగుదల కనపడటం లేదా? గోర్లు బలంగా అందంగా పెరగాలంటే కొన్ని చిట్కాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.అప్పుడే గోళ్లు బలంగా చిట్లిపోకుండా పెరుగుతాయి.

 Home Remedies For Nailgrowth-TeluguStop.com

అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గోళ్లను కొరకకూడదు.ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయటం మంచిది.

ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే గోళ్లు వేగంగా పెరుగుతాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నిమ్మకాయ మరియు కొబ్బరి నూనె నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ పాలిపోయిన గోర్లను ఆరోగ్యంగా చేయటంలో సహాయపడుతుంది.కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ గోళ్లకు అవసరమైన పోషణను ఇచ్చి బలంగా ఉండేలా చేస్తుంది.ఒక స్పూన్ కొబ్బరి నూనెలో 5 చుక్కల నిమ్మరసం వేసి మైక్రో ఒవేన్ లో ఒక సెకన్ వేడి చేయాలి.ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసి మసాజ్ చేస్తే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెరుగుతాయి.

నారింజ రసం నారింజ రసంలో ఫోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన గోళ్ళ పెరుగుదలలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.నారింజ రసంలో గోళ్ళను ముంచి 5 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి.

గోర్లను పొడి టవల్ తో తుడుచుకొని మాయిశ్చరైజర్ రాయాలి.ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube