ఒక సినిమా తీయడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని.అదే ఇంకా పెద్ద సినిమా అనుకోని రోజుకొక యుద్ధం చేసినట్టే.
మరి పెద్ద సినిమా పెద్ద హీరో, పెద్ద కాస్టింగ్, పెద్ద ప్రొడక్షన్.ఇన్ని కలిసి ఒక సినిమా వస్తుంది అంటే అది చాలా టైం టేకింగ్ అని చెప్పాల్సిన పని లేదు.
అయితే ఎటొచ్చి దర్శకుల క్రియేటివిటి ఒక్క సినిమా ఏళ్లకు ఏళ్ళు వెయిట్ చేయడం వాళ్ళ వేస్ట్ అయిపోతుంది కదా.అందుకే ఈ మధ్య కొంత మంది తెలివైన దర్శకులు ఒక పెద్ద సినిమా చేస్తున్న మరొక పక్క సినిమా సినిమాను కూడా చేయడం మొదలు పెట్టారు.మరి ఆలా ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న ఆ దర్శకులు ఎవరో ఒకసారి చూద్దాం.
గౌతమ్ తిన్ననూరి
గౌతమ్( Gautam Tinnanuri ) ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం శ్రీలీల ను కూడా హీరోయిన్ గా తీసుకొని ఆ తర్వాత మార్చి మృణాల్ ఠాకూర్ ని పెట్టుకున్నారు.అయితే గౌతమ్ ఈ చిత్రం షూటింగ్ లేట్ అవుతుండటం తో అది ఒక పక్కన పెట్టి పొన్నియన్ సెల్వన్ సినిమాలో చిన్నప్పటి ఐశ్వర్య రాయి పాత్రలో నటించిన సారా అర్జున్ ని( Sara Arjun ) మెయిన్ లీడ్ గా పెట్టి ఒక హై స్కూల్ రొమాన్స్ డ్రామా చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి షూటింగ్ చేస్తున్నారు.
మారుతీ
డైరెక్టర్ మారుతీ( Director Maruti ) కూడా ఆ మధ్య గోపీ చాంద్ హీరోగా పక్క కమర్షియల్( Pakka Commercial ) సినిమా చేస్తున్న టైం లో కరోనా రావడం తో షూటింగ్ కి చాల ఇబ్బందులు వచ్చాయి.ఈ గ్యాప్ లో సంతోష్ శోభన్ ని హీరో గా పెట్టి మంచి రోజులు వచ్చాయి అనే ఒక సినిమా చేసాడు.
క్రిష్
దర్శకుడు క్రిష్( Krish ) సైతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాకు కమిట్ అయ్యాడు కానీ సినిమా షూటింగ్ కి మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆలస్యం చేస్తున్నాడు అని వైష్ణవ్ తేజ్ తో కేవలం 40 రోజుల్లో కొండపోలం( Kondapolam ) అనే సినిమ చేసేసాడు.ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు ఇంకా టైం పడుతుండటం మరొక సినిమాను చేసే పనిలో ఉన్నారు.
సుధీర్ వర్మ
రవితేజ హీరో గా రావణాసుర సినిమా( Raavanasura Movie ) చేస్తున్న టైం లో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండటం తో సుధీర్ హీరోయిన్స్ రెజీనా, నివేద లతో శాకినీ డాకిని అనే చిత్రాన్ని తెరకెక్కించారు.