తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) కాంగ్రెస్ ఊహించిన విధంగా విజయాన్ని దక్కించుకోవడంతో, త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై అందరి దృష్టి పడింది.కాంగ్రెస్( Congress ) నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే ఎంపీ టికెట్లు( MP Tickets ) దక్కించుకునేందుకు తమకున్న బలుపబడినంత ఉపయోగించి ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు.దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంతో, పెద్ద ఎత్తున టికెట్ కోసం దరఖాస్తులు అందిస్తున్నారు.
నేడు ఈ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ కావడంతో పోటీ చేసే ఆలోచన ఉన్నవాళ్లంతా గాంధీ భవన్( Gandhi Bhavan ) క్యూ కడుతున్నారు.ఇప్పటి వరకు చూసుకుంటే 17 లోక్ సభ స్థానాలకు గాను, 14 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈరోజు దరఖాస్తుకు చివరి తేదీ కావడంతో, భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది.కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్లు దక్కించుకునేందుకు ప్రొఫెసర్లు , ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు ఇలా చాలామంది పోటీ పడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ పోటీ తీవ్రంగా ఉంది.దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నియమాలు పాటిస్తుంది ? పార్టీ సీనియర్ నేతలకు( Congress Senior Leaders ) అవకాశం ఇస్తారా లేక యువ నాయకులకు అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠ కలిగిస్తుంది.ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని ఎంపీ స్థానాన్ని గక్కించుకునేందుకు పెద్ద పోటీ నెలకొంది.
మాజీ సీనియర్లు ,కీలక నేతల కుటుంబ సభ్యులు, సీనియర్ నేతలు చాలామంది టికెట్ ఆశిస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్( Tummala Yugendar ), మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి తో పాటు, మరి ఎంతోమంది కీలక నాయకులు ఖమ్మం ఎంపీ సేటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.