ప్రతి గురు,శుక్ర వారాల్లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో లో మనల్ని ఎంతగానో అలరిస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ సాప్ట్ వేర్ సుధీర్ అనే చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు.ఈ చిత్రం ఇప్పటికే విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
అయితే ఈ చిత్రంలో సుదీర్ సరసన ధన్య బాలకృష్ణన్ కథానాయికగా నటించగా నాజర్, షియాజీ షిండే, సంజయ్ స్వరూప్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రానికి పులిచెర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రం విడుదలకు ముందు సుడిగాలి సుదీర్ పలు సందర్భాల్లో ఈ చిత్రంలో సుదీర్ సరసన నటించడానికి ముందుగా రష్మీ ని సంప్రదించినట్లు మరియు ఆమె డేట్లు ఖాళీ లేనందువలనే ఈ చిత్రాన్ని రష్మీ మిస్ చేసుకుందని చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు స్పందించాడు.
ముందుగా రష్మీని ఈ చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించారు.ఇందుకుగానూ ఆమె 40 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసిందట.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు 35 లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెప్పి చెప్పారు. దీంతో పారితోషికం విషయంలో రష్మి రాజి పడకపోవడంతో ఈ చిత్రాన్ని వదులుకున్నట్లు తెలిపారు.ఈ విషయం తెలిసిన రష్మి, సుదీర్ ల అభిమానులు తీవ్రంగా బాధ పడుతున్నట్లు సమాచారం.బుల్లితెరపై వీరిద్దరి జోడికి ఎంత క్రేజ్ ఉందొ మనందరికీ తెలిసిందే.
ఒకవేళ ఇదే జోడీని వెండితెర మీద కూడా చూపించే బొమ్మ హిట్ అయ్యేదని సుధీర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.