ప్రతిరోజూ పండగే 10 రోజుల కలెక్షన్స్.. ఆగేదిలేదన్న తేజు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడం, పోటీలో ఉన్న బాలయ్య రూలర్ చిత్రం పాతచింకాయ పచ్చడి కావడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

 Prati Roju Pandage 10 Days Collections-TeluguStop.com

సినిమాలోని ఎమోషన్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో 10 రోజులు పూర్తి చేసుకున్నా ఈ సినిమాకు ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు రెండో వీకెండ్ కూడా హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ సినిమా మంచి లాభాల దిశగా వెళుతోంది.

10 రోజలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.21.42 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.మరో రెండు వారాల వరకు ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

ఇక ఏరియాలవారీగా ప్రతిరోజూ పండగే 10 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 9.08 కోట్లు

సీడెడ్ – 2.75 కోట్లు

నెల్లూరు – 0.65 కోట్లు

కృష్ణా – 1.52 కోట్లు

గుంటూరు – 1.49 కోట్లు

వైజాగ్ – 3.27 కోట్లు

ఈస్ట్ – 1.51 కోట్లు

వెస్ట్ – 1.15 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 21.42 కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube