ప్రతిరోజూ పండగే 10 రోజుల కలెక్షన్స్.. ఆగేదిలేదన్న తేజు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడం, పోటీలో ఉన్న బాలయ్య రూలర్ చిత్రం పాతచింకాయ పచ్చడి కావడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

సినిమాలోని ఎమోషన్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో 10 రోజులు పూర్తి చేసుకున్నా ఈ సినిమాకు ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు రెండో వీకెండ్ కూడా హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ సినిమా మంచి లాభాల దిశగా వెళుతోంది.

10 రోజలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.

21.42 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.

మరో రెండు వారాల వరకు ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

ఇక ఏరియాలవారీగా ప్రతిరోజూ పండగే 10 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 9.08 కోట్లు సీడెడ్ - 2.

75 కోట్లు నెల్లూరు - 0.65 కోట్లు కృష్ణా - 1.

52 కోట్లు గుంటూరు - 1.49 కోట్లు వైజాగ్ - 3.

27 కోట్లు ఈస్ట్ - 1.51 కోట్లు వెస్ట్ - 1.

15 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 21.42 కోట్లు.

అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్…. బ్లాక్ బస్టర్ కావడం పక్కా?