సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు.ఎందుకంటే సినిమా అనేది ప్రస్తుతం ఒక బలమైన మాధ్యమం కాబట్టి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు ఇండస్ట్రీ లో వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇక్కడ అనుక్షణం పరితపిస్తూ ఉంటారు.
అందులో భాగంగానే చాలా మంది హీరోలు సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ళు తీసిన ప్రతి సినిమా సక్సెస్ సాధించాలి అని అనుకుంటారు దాని ద్వారా పెద్ద హీరో సినిమాలో అవకాశం రావాలని కోరుకుంటారు అయితే ఇండస్ట్రీ లో డైరెక్టర్ నటుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఆ కాంభినేషన్ చాలా బాగుంటుంది.
తమిళం లో స్టార్ హీరో అయిన రజినీకాంత్,( Rajinikanth )డైరెక్టర్ అయిన కే ఎస్ రవికుమార్ మంచి మిత్రులు అందుకనే రవికుమార్ ఏ స్క్రిప్ట్ రాసుకున్న ఆ స్టోరీ ని ముందు గా రజినీకాంత్ కి వినిపిస్తూ ఉంటాడు.ఇక దానికి తగ్గట్టు గానే సినిమా ఇండస్ట్రీ లో వీళ్లిద్దరి కాంబో లో మంచి హిట్ సినిమాలు వచ్చాయి.ముఖ్యంగా ముత్తు నరసింహ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి…ఇక ఈ సినిమాలే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకున్న వీళ్ళు ఇద్దరు ప్రాణ స్నేహితులు అయితే రవికుమార్ చిరంజీవి తో చేసిన స్నేహం కోసం సినిమా( Sneham Kosam ) ని ముందు గా రజినీకాంత్ >( Rajinikanth )కి చెబితే అది విన్న రజినీకాంత్ ఈ స్టోరీ నాకంటే చిరంజీవి కి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి చిరంజీవి దగ్గరికి పంపించి కథ వినేలా చేసి రజినీకాంత్ ఈ కాంబినేషన్ ని సెట్ చేశాడు…
ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించనప్పటికీ ఒక మంచి సినిమా గా మిగిలింది…ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమా చిరంజీవి ( Chiranjeevi )కెరియర్ లో ఒక మంచి సినిమా గా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి వరుసగా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు…
.