మనం చిన్నప్పుడు ఎన్నో నీతి కథలు విని ఉంటాం.అలాగే తెలుగు లేదా ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా నీతి కథలను చదువుకొని ఉంటాం.
వాటిలో బాగా ఫేమస్ అయిన కథ దాహంతో ఉన్న కాకి( Thirsty Crow ) అని చెప్పవచ్చు.దీనిని ఇంగ్లీష్ మీడియం పిల్లలు “ది థర్ట్సీ క్రో” పాఠంగా చదువుకొని ఉండొచ్చు.
ఈ లెసన్లో కాకి( Crow ) తన తెలివిని ఉపయోగించి, నోటికి అందని నీళ్లను బాటిల్ నుంచి పైకి తీసుకొస్తుంది.
కాకి తన తెలివితేటలను ఉపయోగించి గులకరాళ్ళను మూత తీసిన బాటిల్లో పడవేస్తుంది.
అలా చేస్తూ చివరికి నీటిని పైకి తీసుకొచ్చి హాయిగా తన దాహం తీర్చుకుంటుంది.అయితే బుక్లో రాసి ఉన్న ఈ నీతి కథ( Moral Story ) కల్పితమే అని అందరం అనుకున్నాం.
కానీ ఆ కథను ఓ కాకి నిజం చేసింది.నిజ జీవితంలోనే ఒక తెలివైన కాకి బాటిల్లోని నీటిని బయటికి తీసుకొచ్చేందుకు అందులో గులకరాళ్ళను వేసింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @TansuYegen షేర్ చేసింది.ఆ వీడియో ఓపెన్ చేస్తే.మనకు దాహంతో అల్లాడుతున్న ఒక కాకి కనిపిస్తుంది.
దానికి ముందే ఒక వాటర్ బాటిల్ ఉండగా అందులో నీళ్లు ఉన్నాయి.అయితే ఆ నీళ్లు నిండుగా లేవు.
కాస్త వెలితిగా ఉన్నాయి.దాహం గల ఆ కాకి నీటిని తాగడానికి బాటిల్ లోపలికి తన ముక్కును దూర్చింది.
కానీ నీళ్లు తన ముక్కుకి అందలేదు.దాంతో అది నిరాశ పడలేదు.
నీటిని ఎలాగైనా పైకి తీసుకొచ్చి తాగాలని నిశ్చయించుకుంది.ఆ పని ఎలా చేయాలో అని ఆలోచించి చివరికి రాళ్ళను వేసి పైకి తేవాలని నిర్ణయించుకుంది.
అనుకున్నదే తడవుగా రాళ్ళను వేయడం మొదలుపెట్టింది.
రాళ్లు వేస్తూ అది నీళ్లు అందుతున్నాయా, లేదా అని చాలా సార్లు చెక్ చేసుకుంది.చివరికి ఆ కాకి నీటిని పైకి తీసుకురాగలిగింది.ఆ తర్వాత హాయిగా నీటిని తాగుతూ తన దాహం తీర్చుకుంది.
ఈ వీడియో చూసి నెటిజన్లు వావ్, కాకులు చాలా స్మార్ట్ అని కామెంట్లు పెడుతున్నారు.దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోకి ఇప్పటికే 43 లక్షల వ్యూస్ వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసేయండి.