Almond Peel : బాదం తింటూ వాటి తొక్కలను పాడేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే నట్స్ లో బాదంపప్పు( Almond ) ఒకటి.ఖరీదు ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు బాదం పప్పులో నిండి ఉంటాయి.

 These Are The Amazing Benefits Of Almond Peels-TeluguStop.com

విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ను మనం బాదం ద్వారా పొందవచ్చు.అందుకే ఇటీవల కాలంలో చాలా మంది తమ డైలీ డైట్‌ లో బాదంను చేర్చుకుంటున్నారు.

బాదం పప్పును నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటున్నారు.ఇకపోతే బాదం పప్పును తినే సమయంలో వాటి తొక్క తీసి పారేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.

Telugu Almondpeel, Almond Peel, Almond Peels, Almonds, Care, Tips, Latest, Skin

బాదం పప్పులోనే కాదు తొక్కల్లోనూ పోషకాలు ఉంటాయి.బాదం తొక్కలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మరియు జుట్టు సంరక్షణకు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి. బాదం తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి స్టోర్ చేసుకుంటే అనేక రకాలుగా వాడుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల బాదం తొక్కల పొడిలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), ఒక ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని అరగంట పాటు షవర్ క్యాప్ ధరించాలి.అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

బాదం తొక్కలో విటమిన్ ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది.

ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల కుద‌ళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Telugu Almondpeel, Almond Peel, Almond Peels, Almonds, Care, Tips, Latest, Skin

అలాగే దంత సమస్యలను వదిలించడానికి బాదం తొక్కలు ఉపయోగకరంగా ఉంటాయి.ఎండబెట్టి పొడి చేసిన బాదం తొక్కల పొడిలో కొద్దిగా లవంగాల పొడి మరియు కొబ్బరి నూనె( Coconut oil ) కలిపి దంతాలపై ఉపయోగించాలి.ఇలా చేయడం వల్ల పసుపు దంతాలు తెల్లగా, కాంతివంతంగా మెరుస్తాయి.అదే సమయంలో చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల పోటు వంటి సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి.

ఇక చర్మానికి బాదం పప్పులు తొక్క తీయకుండా మిక్సీ జార్ లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆపై రెండు స్పూన్ల బాదం పొడికి రెండు స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

ముడతలు మాయమవుతాయి.మచ్చలు తగ్గుముఖం పడతాయి.

స్కిన్ అందంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube