Florida I-75 Plane Crash : ఫ్లోరిడాకి సమీపంలో కారును ఢీ కొట్టిన ప్లేన్.. వీడియో వైరల్..

ఫ్లోరిడాలోని( Florida ) హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఓ చిన్న విమానం( Small Plane ) కారును ఢీకొట్టింది.

 Plane Crash In Florida As Jet Smashes Into Cars During Emergency Landing-TeluguStop.com

ప్రమాదం తర్వాత విమానం, కారులో మంటలు చెలరేగాయి.ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు వచ్చారు.

ప్రమాదం జరిగిన చోటు కొల్లియర్ కౌంటీలోని( Collier County ) పైన్ రిడ్జ్ రోడ్‌కు సమీపంలో ఉన్న ఇంటర్‌స్టేట్ 75 దక్షిణం వైపు ఉంది.పోలీసులు మరింత విచారణ కోసం హైవే దక్షిణం వైపును మూసివేశారు.

ఈ చిట్టి విమానం పేరు బొంబార్డియర్ ఛాలెంజర్ 600.( Bombardier Challenger 600 ) ఇది ఒహియో నుంచి వచ్చి ఫోర్ట్ లాడర్‌డేల్‌కు వెళ్తోంది.ఆ సమయంలో విమానం ఇంజన్లలోని ఒకదానిలో సమస్య ఏర్పడింది, దాంతో పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు.అయితే కిందకు దిగుతుండగా కారును( Car ) ఢీకొట్టింది.

విమానంలో, కారులో ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియ రాలేదు.ఎవరైనా గాయపడ్డారా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డారో అధికారులు ఇంకా వెల్లడించలేదు.

విమానం ల్యాండింగ్ అవుతున్నపుడు కారును ఢీకొట్టింది.ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలి, వేరే మార్గాన్ని ఉపయోగించాలి.దీనిపై అప్‌డేట్స్‌ ఇస్తాం.” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రమాదం జరిగిన ప్రదేశంలో అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు.మంటలను ఆర్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు.వీలైనప్పుడు వారు మరింత సమాచారాన్ని పంచుకుంటారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసే చాలామంది షాక్ అవుతున్నారు.

విమానం, కారులో ఉన్న వారికి ఏమైందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube