కొండ చిలువ అంటేనే ఎంతో భయం వేస్తుంది.ఎదుకంటే దాని బారిన పడితే ఇంకేమైనా ఉందా అమాంతం మింగేస్తుంది.
దాని కడుపులో ఎంత పెద్ద జీవిని అయినా సరే ఇట్టే మింగేస్తుంది.ఇక ఇలాంటి కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైలర్ అవుతుంటాయి.
మామూలుగానే మనకు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు గానీ లేదంటే ఫొటోలు గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి.కాగా కొండ చిలువ కూడా కొన్నిసార్లు తాను తిన్న ఆహారం జీర్నించుకోలేక వాంతి కూడా చేసుకుంటుంది.
ఇక ఇ్పుడు మనం చెప్పుకోబోయే వార్తలో ఓ కొండచిలువ చేసిన పని చివరకు దాని కొంప ముంచింది.ఏకంగా దాని ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.బాగా ఆకలి మీద ఉన్న ఆ కొండచిలువ దగ్గరలో ఉండే చేపల వలలోకి వెల్లి చేపలను తినేందుకు ట్రై చేసింది.ఇక దొరికిందే ఛాన్ష్ అన్నట్టు చేపలు కూడా బాగానే ఉండటంతో కడుపు నిండా తినేసింది.
కానీ అక్కడే దానికి పెదద్ చిక్కు వచ్చి పడింది.ఆ వలలో చిక్కుకున్న దానికి అస్సలు ఊపిరాడక ఎటూ కదల్లేక చివరకు చనిపోయింది.
అయితే ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.

ఈ తిరుమ ప్రాంతంలో ఉండే చెరువు వీధిలో చిన వెంకన్న స్వామి సాగరం అనే చెరువులో చాలామంది చేపలు పడుత ఉంటారు.కాగా అందలో రీసెంట్ గా కొందరు చేపలు పట్టడం కోసం వల పెడితేం అందలో కొన్ని చేపలు కూడా పడ్డాయి.అయితే దాదాపుగా 6 అడుగుల పొడువు ఉన్న ఓ కొండచిలువ అందులో పడ్డ చేపలను ఆరగించేందుకు వెళ్ళింది.
అయితే దానికి చేపలను తిన్న తర్వాత ఎటూ కదలరాలేదు.వలలో చిక్కుకుపోయి చివరకు ఊపిరాడక ప్రాణాలు విడిచింది.ఇక జాలర్లు వచ్చి చూడగా మృతిచెందిన కొండచిలువను చూసి షాక్ అయిపోయారు.