బీజేపీని సొంతనేతలే ముంచుతున్నారా ?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ( BJP ) ఎంత పట్టుదలగా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.కర్నాటకలో చేజారిన అధికారాన్ని తెలంగాణలో దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 The Problem That Haunts Bjp , Bjp, Brs,  Karnataka, Bandi Sanjay, Etela Rajender-TeluguStop.com

బి‌ఆర్‌ఎస్ ( Brs )లు రాబోయే రోజుల్లో బీజేపీనే అని ఆ మద్య ఘంటాపథంగా చెబుతూ వచ్చిన కమలనాథులు.ప్రస్తుతం ఆ విషయంలో సైలెన్స్ పటిస్తున్నారు.

ఎందుకంటే తమొకటి తాలిస్తే.దైవం ఇంకొకటి తలుస్తాడన్నట్లు.

కర్నాటక ఎన్నికలు ఆ పార్టీకి గట్టి గుణపాఠమే నేర్పాయని చెప్పవచ్చు.ఫలితంగా తెలంగాణలో బీజేపీ గెలుపును కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు కమలనాథులు.

Telugu Bandi Sanjay, Etela Rajender, Karnataka, Raghunandan, Telangana, Problem

అదికాక ప్రస్తుతం పార్టీలో కూడా నేతల మద్య సక్యత లేదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.బండి సంజయ్, ఈటెల రాజేందర్, దర్మపురి అరవింద్, రఘునందన్.( Bandi Sanjay, Etela Rajender, Dharmapuri Arvind, Raghunandan ).వంటి నేతలు ఎవరికీ వారు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.దీంతో అధిస్థానం పరిస్థితులు చక్కదిద్దెందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.తరచూ ఈటెల రాజేంద్రను డిల్లీకి పిలిపించడం, ఆ వెంటనే బండి సంజయ్ తో కూడా చర్చలు జరపడం, వీరిద్దరు ఎవరికి వారే అన్నట్లుగా వ్యాఖ్యానించుకోవడం చూస్తే బీజేపీలో ముసలం ఏర్పడిందనే వాదన బలపడుతోంది.

Telugu Bandi Sanjay, Etela Rajender, Karnataka, Raghunandan, Telangana, Problem

ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి( AP Jitender Reddy ) ఇటీవల చేసిన ట్వీట్ ఆ పార్టీలోని విభేదాలకు అద్దం పడుతోందనేది కొందరి వాదన.బీజేపీ క్రమశిక్షణ తప్పుతోందని నేతలను సరైన పద్దతిలో ఉంచేందుకు ట్రీట్మెంట్ అవసరం అనే అర్థం వచ్చేలా ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఆ ట్వీట్ పై బీజేపీ నేతలే మండి పడుతున్నారు.” ఏది పడితే అది పోస్ట్ చేయడం మంచిది కాదని, సొంత పార్టీ నేతలే పరువు తీసేలా వ్యవహరించడం పార్టీని దిగజార్చుకోవడమే అని కొందరు కమలనాథులు జితేందర్ రెడ్డి పై మండిపడుతున్నారు.ఇలా నేతల మద్య అంతరం ఇలాగే కొనసాగితే.పార్టీ గెలుపు కాదుకదా.కనీసం మినిమమ్ సీట్లు కూడా దక్కించుకోవడం కష్టమని సొంత పార్టీ నేతలతోనే బీజేపీని ముంచుతున్నారని బీజేపీలోని ఓ వర్గం ఆందోళన చెందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube