మన్యం జిల్లా భామిని మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.పసుకుడిలో గజరాజులు చేసిన దాడిలో ఫారెస్ట్ ట్రాకర్ ప్రాణాలు కోల్పోయారు.
ట్రాకర్ లక్ష్మీనారాయణను ఏనుగులు తొక్కి చంపాయి.గత నెలలో తాలాడలో కూడా ఓ రైతును బలితీసుకున్న సంగతి తెలిసిందే.
గజరాజుల దాడులతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు.
ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును తక్షణమే అడవిలోకి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
.