జంతువులు ఒక్కోసారి ఊహించని విధంగా బిహేవ్ చేసి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇలాంటి యానిమల్ బిహేవియర్స్‌కి సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు కెమెరాకి చిక్కి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియో వైరల్‌గా మారడంతో దాని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వీడియోలో చాలా మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతి గదిలోకి కోతి ప్రవేశించింది.
శ్వేతా మనోజ్ మిశ్రా అనే బ్లాగర్ ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు పార్ట్స్‌గా షేర్ చేసుకున్నారు.ఫస్ట్ వీడియో పార్ట్‌లో స్టూడెంట్స్ కూర్చున్న ఒక డెస్క్‌పై ఒక కోతి నడవడం చూడవచ్చు.
ఈ కోతి కోచింగ్ క్లాస్‌లోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే ఈ తరగతి గదిలో ప్రతి ఒక్కరూ సాధారణ దుస్తులు ధరించారు.
వారు బ్యాక్‌ప్యాక్‌లు తీసుకుని వచ్చారు.వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ తెచ్చిన ఆ విద్యార్థులు వాటిని డెస్క్‌పై ఉంచారు.
అయితే ఈ మంకీ డెస్క్‌పై ఉన్న యెల్లో కలర్ బాటిన్‌ను తీసుకోవడానికి కొన్ని అడుగులు ముందుకు నడిచింది.
అయితే కోతి అలా ముందుకు వస్తూ ఉంటే విద్యార్థులు భయపడిపోయి వెనక్కి పరిగెత్తారు.
ఆ బాటిల్ గల విద్యార్థి మాత్రం కొంచెం కూడా భయపడలేదు.ఆ బాటిల్‌ను కోతి నుంచి అతడు లాక్కున్నాడు.
ఆ తర్వాత కోతి కరుస్తుందేమోనని విద్యార్థులంతా దానికి దూరంగా వెళ్లిపోయారు.అయితే అది బాటిల్ కోసం వెతుకుతూ ఉండడంతో ఒక విద్యార్థి దాని దాహం తీర్చేందుకు ముందుకొచ్చాడు.
దానికి ఒక సాఫ్ట్ కోల్డ్ డ్రింక్ అందించాడు.ఈ బాటిల్ మూతను తెరవడానికి కోతి చాలా కష్టపడింది.
దాంతో ఆ విద్యార్థి ఆ మూత తీసేందుకు ప్రయత్నించాడు కానీ కోతి దగ్గరికి రానివ్వలేదు.దాంతో వీడియో ముగిసింది.
రెండో పార్ట్ వీడియోలో ఈ కోతి ఆ బాటిల్ మూతను తీయగలిగింది.ఆ తర్వాత దానిని అందులోని డ్రింక్ తాగిందో లేదో వీడియోలో కనిపించలేదు.