మెగాస్టార్ చిరంజీవి హీరో గా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందిన సినిమా గాడ్ ఫాదర్ ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమా వచ్చే నెల ఐదో తారీఖున దసరా కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికం గా ప్రకటన వచ్చింది.
అంటే సినిమా విడుదలకు కనీసం నెల రోజుల సమయం కూడా లేదు.అయినా గాడ్ ఫాదర్ హంగామా కనిపించడం లేదు.
ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా లు అన్నీ కూడా విడుదలకు మూడు నాలుగు వారాల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు.అలా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా జనాల్లోకి వెళ్లి మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుంది.
కానీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ.డేట్ కానీ ఇవ్వడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.
కనీసం ఈ సినిమా విడుదల కావడానికి రెండు వారాల ముందు అయినా మెగా స్టార్ చిరంజీవి వచ్చి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.ఆచార్య సినిమా ఫలితం నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్ విషయం లో కాస్త వెనకంజ వేస్తున్నారట.
సినిమా కి భారీ ఎత్తున హైపు క్రియేట్ కాకుండా చూడాలని చిత్ర యూనిట్ సభ్యులకు చిరంజీవి సూచించారని టాక్.అందులో భాగంగానే ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా అన్ని పనులు చేస్తున్నారేమో.
మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అయినా గాడ్ ఫాదర్ అదే స్థాయిలో సక్సెస్ అవుతుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.