చైతూకు జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరంటే?

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టు కుంటాడు.

 Malashree Daughter Radhana Ram Telugu Debut Movie With Naga Chaitanya, Radhana R-TeluguStop.com

ఎక్కువగా ప్రేమ కథలు చేస్తూ మెప్పిస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు థాంక్యూ తో ప్లాప్ ఎదుర్కొన్నాడు.

థాంక్యూ ఇచ్చిన గుణపాఠంతో చైతూ నెక్స్ట్ కమిట్ అయినా పరశురామ్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు నాగ చైతన్య తో సినిమా లైన్లో పెట్టాడు.కాగా ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అవ్వాల్సి ఉండగా మహేష్ తో ఛాన్స్ కారణంగా ఈ సినిమా వాయిదా వేశారు.

చైతూ కూడా థాంక్యూ సినిమా షూటింగ్ కాగానే పరశురామ్ తో చేయాల్సి ఉండగా.వెంకట్ ప్రభు తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.మరి ఈ సినిమాతో పాటు పరశురామ్ సినిమా కూడా పూర్తి చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాలో చైతూకు జోడీగా నటించబోయే హీరోయిన్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

Telugu Malashree, Naga Chaitanya, Parashuram, Radhana Ram, Radhanaram-Movie

తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ కూతురు రాథానా రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.ఈమె ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూట్ చేస్తుండగానే రాథానా రామ్ కు నాగ చైతన్య సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube