హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోవచ్చునని యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అంటే రాష్ట్రంలో పేద వర్గాల విద్యార్ధులను చదువులకు దూరం చేయడమే అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అభిప్రాయ పడుతుంది.ఈ మెరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.
ఎల్.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.కరోనా ఇతర పరిస్థితి వల్లన చాలా మంది తమ ఆదాయాలు కోల్పోయారని ఇలాంటి తరుణంలో పేద విద్యార్ధులకు బాసటగా నిలవాల్సిన న్యాయస్థానాలు ఫీజులు పెంచుకోవాలనే తీర్పుల వల్లన మరింత మంది విద్యార్ధులు చదువులకు దూరం అవుతారని తెలిపారు.
ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయంబర్స్ మెంట్స్ 35000 వేల రూపాయాలు మాత్రమే ఒక కళాశాలలో లక్ష రూపాయాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్స్ పోను మిగతాది విద్యార్ధులే భరించాలని ఇది అత్యంత భారంగా మారే పరిస్థితి ఉంది.ప్రతి మూడేళ్ళ కోక్కసారి పెంచే ఈ ఫీజులు ప్రభుత్వం సకాలంలో నిర్ణయించకపోవడం,ఈ ఫీజులను నిర్ణయించే ప్రభుత్వం కూడా దీనిని తెల్చకపోవడం లాంటి చర్యలు వల్లన విద్యార్ధులపై భారాలు పడుతాయని తెలిపారు.
ఈ ఉత్తర్వులు రాష్ట్రంలో విద్యా వ్యాపారాని పెంచే చర్యలకు ఊతం ఇవ్వడమేన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపుపై కౌంటర్ ధాఖలు చేసి ఫీజులు ఉపసంహరణ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఫీజుల భారం పడకుండా విధివిధానాలు ప్రకటించాలని ,లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ ప్రకటిస్తుంది.