కోనసీమ అల్లర్ల కేసు త్వరలోనే ముగుస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ ను మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కలిశారని చెప్పారు.
అమాయకులపై నమోదైన కేసులను ఉప సంహరించుకోవాలని కోరారని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.యువత భవిష్యత్ పాడవుతుందని సీఎం జగన్ కు వివరించారన్నారు.
త్వరలోనే ఆయా కుల పెద్దలతో కలిసి విశ్వరూప్, పొన్నాడ సీఎం జగన్ ను మళ్లీ కలుస్తారని వెల్లడించారు.మంత్రి వేణు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలలో మంత్రి వేణుగోపాల కృష్ణ మళ్లీ రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తారని తెలిపారు.అదేవిధంగా పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబేనని తేల్చి చెప్పారు.