కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.ఈమె క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి సందడి చేశారు.
ఇలా జయమ్మ పాత్రలో నటించిన ఈమెకు తెలుగు తమిళ భాషలలో వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో భానుమతి పాత్రలో వీర సింహారెడ్డికి చెల్లెలు పాత్రలో నటించి సందడి చేశారు.
ఈ విధంగా భానుమతి పాత్రకు గాను వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా భానుమతి పాత్ర గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో వీర సింహారెడ్డిని చంపి పొడిచే సన్నివేశం షూటింగ్ చేసే సమయంలో తనకు కాస్త భయం వేసిందని తెలిపారు.
ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి బాలయ్యను తాను ఇలా పొడిచి చంపడాన్ని బాలయ్య అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయమేసింది.
సినిమా థియేటర్లలో ఈ సన్నివేశం చూసిన తర్వాత బాలయ్య అభిమానులు నిజంగానే నన్ను చంపేస్తారని భయపడ్డాను అయితే ఆ సమయంలో బాలకృష్ణ గారు తనకు భరోసా ఇచ్చారు.తన అభిమానులు ఈ సన్నివేశాన్ని ఏమాత్రం నెగిటివ్ గా రిసీవ్ చేసుకోరని భరోసా కల్పించారు.అయితే బాలకృష్ణ గారు చెప్పిన విధంగానే మీరందరూ కూడా ఈ సన్నివేశాన్ని నెగిటివ్ గా తీసుకోలేదని, ఆ సీన్ ను మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్స్ అంటూ ఈమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.