ఆ మిస్టరీ స్పిన్నర్ కుటుంబంలో తీవ్ర విషాదం..!

ఈ మధ్యకాలంలో క్రికెటర్లలో రషీద్ ఖాన్ బాగా రానిస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు.రికార్డులు నెలకొల్పుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.

 That Mystery Is A Serious Tragedy In The Spinner Family Mister Spinners, Rasid K-TeluguStop.com

అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ అయిన రషీద్‌ ఖాన్‌ మంచి ప్రదర్శనతో తన సత్తా చాటుకున్నాడు.తాజాగా ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

రషీద్ ఖాన్ కజిన్‌ అయినటువంటి హమీద్‌ఖాన్‌ మరణించారు.ఆ విషయాన్ని రషీద్‌ ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.

తన కజిన్‌ అయిన హమీద్‌ ఖాన్‌ ఇక లేడని, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లుగా రషీద్ ఖాన్ తెలిపాడు.తన మాటలను రషీద్‌ ట్వీట్‌ చేశాడు.

అయితే హమీద్‌ఖాన్‌ మృతికి గల కారణాలను రషీద్‌ వివరించి చెప్పలేదు.రషీద్‌ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు.

బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడిలైడ్‌ స్టైకర్స్‌ కు రషీద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.అదే విధంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ మెగా వేలం ముందు రషీద్‌ ఖాన్‌ ని సన్‌రైజర్స్‌ రీటైన్‌ చేసుకోలేదనే సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో రానున్న మెగా వేలంలో రషీద్ ఖాన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడి కొనుక్కునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఐపీఎల్‌ మెగా వేలాన్ని ఫిబ్రవరిలో బీసీసీఐ నిర్వహించనుంది.గత టీ20లో రషీద్ అద్బుత ప్రదర్శన ఇవ్వడం అందరినీ ఉర్రూతలూగించింది.మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ టీ20లో అరుదైన రికార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు.

టీ20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ లో మార్టిన్ గుప్టిల్‌ను ఔట్ చేయడం ద్వారా రషీద్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్‌ గా, ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా రషీద్ ఖాన్ మంచి పేరును సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా హైదరాబాద్ టీమ్‌కు ఎక్కువ రోజులు ఆడటంతో తెలుగు ప్రజలు ఆయన్ని బాగా గుర్తు పెట్టుకున్నారు.ఆయన ఆటకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube