స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) స్పీచ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూనే ఉంటారు.అయితే ఎప్పుడో కానీ ఈయన స్పీచ్ ఆడియెన్స్ కు దొరకదు.
మరి తాజాగా ఆ మూమెంట్ నిన్న జరిగింది.ఈయన తాజాగా నటించిన మూవీ ‘లియో‘.
ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.
అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 500 కోట్లకు పైగానే రాబట్టి బ్లాక్ బస్టర్ అవ్వడంతో మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
మరి ఈ వేడుకకు విజయ్ తో పాటు టీమ్ అంత హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్ లో విజయ్ చేసిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.ఎందుకంటే ఈ వేడుకలో
రజినీకాంత్ పై విజయ్
సెటైర్స్ వేశారు.రజినీకాంత్ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ”కాకి ఎగరగానే ఈ ప్రపంచం మొత్తం తనదే అని అనుకుంటుంది.
కానీ ఆ ఆకాశంలో నేను గ్రద్ద లాంటివాడిని.నన్ను కాకులు ఏమీ చెయ్యలేవు” అంటూ ఈయన విజయ్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసారు.
ఈ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ విజయ్ లియో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.”ఒక అడవిలో క్రూరమైన జంతువులు చాలా ఉన్నాయి.అదే అడవిలో ఒక కాకి, గ్రద్ద కూడా ఉంటాయి.ఎంత పెద్ద గ్రద్ద అయినా కాకి అయినా నేల మీదకు రావాల్సిందే.నేను నేల లాంటివాడిని.ఎప్పుడు తటస్తంగానే ఉంటారు” అంటూ విజయ్ కామెంట్స్ చేసారు.
అలాగే ఇండస్ట్రీలో ఒక్కడే సూపర్ స్టార్.ఒక్కరే ఉలగనాయగన్.
ఒక్కరే థలా అంటూ రజిని, కమల్, అజిత్ ల కోసం కూడా మాట్లాడారు.దీంతో ఈయన స్పీచ్ కోలీవుడ్ లోనే కాదు మిగిలిన ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అవుతుంది.
మరి రజినీకాంత్ ఈయన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.