ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.క్షుద్రపూజలు చేస్తున్నారంటూ రామపురానికి చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే మాంత్రికుడని భావిస్తున్న ఓ వ్యక్తిని మత్స్యకారులు గ్రామంలోని గుడిలో నిర్బంధించారు.అంతేకాకుండా పోలీసులు గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
మాంత్రికుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలో మత్స్యకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.