టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో వివాదం రాజుకుంది.చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం రాజుకుంది.
అయితే పాదయాత్రలో భాగంగా ప్రచార రథంపై నుంచే లోకేశ్ ప్రసంగించారు.
ఇది నిబంధనలకు విరుద్ధమని పోలీసులు తెలిపారు.అనంతరం వాహనాన్ని సీజ్ చేయడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.
దీంతో పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.