ఈ మెడికల్ సింబల్ లో పాములు ఎందుకు ఉన్నాయి... ఇది దేన్ని సూచిస్తుందో తెలుసా..

వైద్య రంగంలో వాడే కొన్ని సింబల్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి.ఒక కర్రని చుట్టుకున్న రెండు పాములు, దానికి పైనున్న ఒక జత రెక్కలను కూడా ఒక వైద్య చిహ్నంగా పరిగణిస్తారు.

 Reasons Behind Snakes Wings On A Stick In Medical Symbol Details, Medical Symbo-TeluguStop.com

అయితే పాములకి, వైద్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది దేన్ని సూచిస్తుంది? వంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు.అయితే ఇప్పుడు ఈ చిహ్నం వెనుక ఉన్న ఓ పెద్ద కథ గురించి తెలుసుకుందాం.

ఈ ఐకాన్ ని ‘కాడ్యూసియస్’ (caduceus) అని అంటారు.చాలా ఏళ్ల క్రితం ఒలింపియన్ దేవుడు హీర్మెస్ (Hermes) తనతో ఒక కర్ర ఉంచుకునే వాడు.ఇతన్ని గాడ్స్, హ్యుమన్స్ కు మధ్య ఒక మెసెంజర్ గా ట్రీట్ చేసే వారు.అయితే ఇతను ఒక దేవదూత కాబట్టి అంటే దేవుని వద్ద నుంచి మనుషులకు మెసేజ్‌లు అందించే అతను కావున అతడికి రెక్కలు ఉండేవి.

అయితే హీర్మెస్ అప్పటి కాలంలో చాలామంది రోగాలను నయం చేశాడు.అలా అతను దేవదూతగా మాత్రమే కాకుండా వైద్యుడిగా అందరికీ పరిచయమయ్యాడు.

ఇలా వైద్యరంగంలో అతని సేవలకు గుర్తుగా ఏదో ఒక సింబల్ ఉంచాలనుకున్నారు.ఈ ఆలోచన నుంచే అతని కర్రను, రెక్కలను ఒక సింబల్ గా మార్చడం జరిగింది.

ఇక పాములు విషయానికి వస్తే.అపోలో అనే ఒక గాడ్ అప్పట్లో జనాలకు ట్రీట్మెంట్ అందించేవాడు.

Telugu Apollo, Caduceus, Caduceusmedical, Hermes, Latest, Medical Symbol, Stick-

అంతేకాదు ఇతను హీర్మేస్‌కు సహకరించేందుకు మెడికల్ స్టాఫ్ ని సరఫరా చేసేవాడు.ఇక గాడ్స్ కింగ్ అయిన జ్యూస్ అనే ఒక రాజు కూడా హీర్మేస్‌కు సిబ్బందిని అందించేవాడు.ఈ ఇద్దరినీ రెండు తెల్ల రిబ్బన్లతో సూచించేవారు.అలా కర్రకు మొదట రెండు తెల్ల రిబ్బన్లను యాడ్ చేశారు.కాలక్రమేణా తెల్ల రిబ్బన్లను రెండు పాములు గా సూచించడం మొదలుపెట్టారు.అలా రెండు పాములు మధ్యలో కర్ర, పైన రెక్కలతో ఒక మెడికల్ సింబల్ తయారయ్యింది.

మరో కథనం ప్రకారం, హీర్మేస్‌ పోట్లాడుతున్న రెండు పాముల మధ్యలో ఒక కర్ర పెట్టి వాటిని శాంతపరిచారట.ఆ తర్వాత ఆ రెండు పాములు వైద్యం లో అతనికి సహకరించాయి.

అందుకే వాటిని కర్ర చుట్టూ చుట్టుకున్న పాములుగా ఉంచారని అంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube