ఆ నాయకులు దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు హీరో...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు దర్శకత్వం వహించిన “మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణ మూర్తి” అనే చిత్రం ద్వారా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరో శివాజీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే  ఒకప్పుడు తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శివాజీ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బాగానే రాణిస్తున్నాడు.

 Telugu Actor Sivaji Sensational Comments On State Politics In Covid Situation, S-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో శివాజీ పాల్గొని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో సినీ సెలబ్రిటీలు మరియు ఇతర ప్రజలు స్పందించి పేదలకి  సహాయం చేసేందుకుగాను డబ్బు మరియు ఇతర రూపంలో సహాయాలు చేశారని కానీ రాజకీయ నాయకులు మాత్రం ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి తీయలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంతేగాక ఈ కోవిడ్ పరిస్థితులలో రాజకీయ నాయకులు ప్రజలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఆ మధ్య కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడంలో కూడా కొంత మంది రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ గోధుమ పిండి పంపిణీ చేశారని ఇంతటి దౌర్భాగ్యం రాజకీయ నాయకులు ఉన్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కోవిడ్ ప్రభావం మొదలవక ముందు తన సొంత గ్రామానికి వెళ్లానని ఆ సమయంలో ఎన్నో అంశాలను నేర్చుకున్నానని తెలిపాడు. ఈ కరోనా వైరస్ పరిస్థితులలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం అలవాటుగా చేసుకున్నానని, అలాగే తన కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా తమ వద్దకు సహాయం కోసం వస్తే తోచినంత సహాయం చేస్తున్నారని ఈ విషయం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు.

దీంతో ప్రస్తుతం శివాజీ రాజకీయ పరిస్థితులపై చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Andhra Pradesh, Covidandhra, Sivaji, Telugu, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో  శివాజీ బాగానే అలరించాడు.అయితే శివాజీ నటుడిగా మాత్రమే కాకుండా తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (పిజ్జా), తెలుగు యంగ్ హీరో నితిన్(దిల్) మరియు ప్రముఖ నటుడు యశో సాగర్(ఉల్లాసంగా ఉత్సాహంగా) తదితర హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పాడు.అలాగే తెలుగులో 20కిపైగా చిత్రాలలో హీరోగా నటించాడు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో చేరి తన సేవలను అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube