తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి బాబు దర్శకత్వం వహించిన “నచ్చావులే” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ హీరోయిన్ “మాధవీ లత” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో మాధవీ లత తను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతోంది.
అంతేగాక తాను నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడు సినిమా హీరోయిన్ అవకాశాలను దక్కించుకో లేక పోయింది.దీంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అనుకోకుండా ఓటమి పాలైంది.
అయినప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తన సేవలను అందిస్తోంది.
అయితే తాజాగా మాధవీ లతకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో మాధవీ లత తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన “అతిథి” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది.దీంతో అతిథి చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మాధవీ లత పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించ లేదు. కానీ తాజాగా కొంతమంది నెటిజన్లు మాధవీ లత ఫోటోలను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఫోటోలనీ షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మాధవీ లత తెలుగు మరియు తమిళం తదితర భాషలలో కలిపి దాదాపుగా తొమ్మిదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “స్నేహితుడా.!” మరియు యంగ్ హీరో తనీష్ కి జంటగా నటించిన “నచ్చావులే” చిత్రాలు తప్ప ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.దీంతో ఈ అమ్మడు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయింది.