తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి హరీశ్ రావు పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో బడ్జెట్ పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు.దీంతో సమావశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది.