బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి (Amar Deep Chowdary) ఒకరు.సీరియల్స్ ద్వారా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈయన హౌస్ లోకి వెళుతున్నారనే విషయం తెలియడంతో ఈయనని టైటిల్ విన్నర్ అని అందరూ భావించారు.
కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈయన ఆట తీరు చూసి అందరూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఈయన హౌస్ లో ఏమాత్రం తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకోలేకపోతున్నారు.
అంతేకాకుండా పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో నెగెటివిటీ కూడా మూట కట్టుకున్నారు.ఇక నాగార్జున కూడా ఈయన ఆటతీరు పట్ల నిరాశ వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే.
అమర్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియడంతో టైటిల్ ఈయన గెలుచుకుంటారన్న హోప్స్ కాస్త పూర్తిగా తగ్గిపోతూ ఈయన మరొక కొద్ది రోజులలో ఎలిమినేట్ అవుతారన్న స్థాయికి ఈయన వచ్చేసారు.అయితే బిగ్ బాస్ కార్యక్రమం( Bigg Boss ) తర్వాత తన భర్త అమర్ గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో నటి తేజస్విని( Tejaswini )సోషల్ మీడియా వేదికగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి అన్ ఫిట్ ,ఈ కార్యక్రమంలో కొనసాగడానికి ఈయన పనికిరారు అంటూ పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ అమర్ చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం ఒక చిన్న పిల్లలను మనం ప్రతి ఒక్క విషయంలో ఎలా గోము చేస్తామో అదే విధంగా అమర్ కి కూడా ప్రతి ఒక్క విషయం వివరించాల్సి ఉంటుందని తేజస్విని తెలిపారు.అమర్ దీప్ టాస్క్ లలో కష్టపడి ఆడతాడు.మైండ్ గేమ్స్ లో( Mind Games ) తడబడతాడు.బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ అర్థం చేసుకుని ఆడలేడు.ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాడు.

బిగ్ బాస్ హౌస్లో 24 గంటలలో జరిగినది కేవలం మనకు ఒక గంటలో చూపిస్తారు అయితే వీరు మంచి కాకుండా ఎక్కడైనా చెడుగా మాట్లాడటం ఒకరి పైన ఏదైనా కోపంగా ప్రవర్తించిన అలాంటి సన్నివేశాలను మాత్రమే మనకు ప్రోమో ద్వారా విడుదల చేస్తూ ఉంటారు.ఇలా ఒక గంటలో వారిని చూసి ఎవరూ కూడా జడ్జి చేయకూడదని, ఇలాంటి వాటిని చూపించడం వల్లే అమర్ పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి అంటూ తేజస్విని వెల్లడించారు.ఇలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వారి మధ్య అమర్ రాణించడం కష్టమేనని నాకు ముందే తెలుసు అంటూ తేజస్విని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.