రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageswararao) దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhisekh Aggarwal ) సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ రామ్ చరణ్ ( Ramcharan )గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) హీరోగా తెరకెక్కబోయే ది ఇండియా హౌస్ ( The India House ) అనే ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ కూడా భాగమయ్యారు ఇదే విషయాన్ని తాజాగా అభిషేక్ అగర్వాల్ తెలియచేశారు.నిర్మాత రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా కథ ఒకసారి వినమని చెప్పారట అయితే ఈ సినిమా కథ వివరిస్తున్నటువంటి సమయంలో రామ్ చరణ్ ఈ సినిమా పట్ల చాలా ఆసక్తి కనపరచడమే కాకుండా ఈ సినిమాపై చాలా నమ్మకం ఏర్పడటంతో ఏకంగా ఆయన కూడా ఈ సినిమా నిర్మాణంలో 50 శాతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

ఈ విధంగా నిఖిల్ నటించబోయే ఈ సినిమా రామ్ చరణ్ కు విపరీతంగా నచ్చినటువంటి సందర్భంలోనే ఆయన 50 శాతం పెట్టుబడులు పెట్టారని ఆయనకి ఈ సినిమాలో 50% వాటా ఉంది అంటూ అభిషేక్ వెల్లడించారు.ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ బయోపిక్ గా రాబోతోందా అనే సందేహాలు నేపథ్యంలో ఈ విషయంపై కూడా నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా వీర్ సావర్కర్ కి సంబంధించిన కథ మాత్రమే కానీ ఆయన బయోపిక్ కాదు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమయ్యారు అనే విషయం తెలియడంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.







