టిడిపి జనసేనల తొలి అస్త్రం “మినీ మేనిఫెస్టో”

ఇంతవరకూ తెలుగుదేశం జనసేనల( TDP , Jana sena ) పొత్తు ఇరు పార్టీల సమన్వయ భేటీల వరకే పరిమితమైపోయింది, తప్ప కీలకమైన క్రియాశీలక చర్యలేమి జరగలేదు.అయితే దీపావళి తదుపరి రోజు అయిన సోమవారం ఈ రెండు పార్టీల నుంచి ఒక కీలకమైన అప్డేట్ బయటికి వచ్చింది.

 Tdp Janasenas First Weapon Mini Manifesto , Tdp , Janasena ,amaravati , Mini-TeluguStop.com

రెండు పార్టీల ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ఉమ్మడి నిర్వాహక కమిటీ రిలీజ్ చేసింది.ఇందులో తెలుగుదేశం నుంచి ఆరు అంశాలను జనసేన నుంచి ఐదు అంశాలను పొందుపరిచినట్లుగా తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో యువత ఓటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్న అంచనాలు ఉండటంతో మినీ మేనిఫెస్టో వారిని ఆకర్షించేటట్టుగా తయారు చేసినట్లుగా కనిపిస్తుంది.ఎందుకంటే సరయిన ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లాల్సిన ధుస్థితి లో ఉండటం వల్ల వారికి వ్యాపార పరం గా ఊతమిచ్చే ఉద్దేశం తో “సౌభాగ్య పథకం” కింద ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపిక చేసిన 500 యువ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల వరకు రుణాలను మంజూరు చేసేలా ఈ పథక రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది.

Telugu Amaravati, Ap, Chandra Babu, Janasena, Manifesto, Pawan Kalyan, Ys Jagan-

ఇది తిరిగి చెల్లించనవసరం లేదని అయితే దీనివల్ల మరి కొంతమందికి ఖచ్చితంగా ఉపాధి ఇవ్వాలనే నియమం పెడుతూ నిదులు మంజూరు చేసెట్టు గా రూపొందించారట .అదేవిధంగా ఆక్వా, ఉద్యానవన ,పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పేదలకు ఉచిత ఇసుక, బీసీల సంక్షేమం కోసం కొత్త చట్టాలు, రాజధానిగా అమరావతి ( Amaravati )కొనసాగింపు వంటి అంశాలను కూడా ఈ మినీ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది.

Telugu Amaravati, Ap, Chandra Babu, Janasena, Manifesto, Pawan Kalyan, Ys Jagan-

వివిధ వర్గాల నుంచి పూర్తిస్థాయి ప్రతిపాదనలు కూడా తీసుకొనిసంపూర్ణ మేనిఫెస్టో( Manifesto )ను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ప్రతి నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల నుంచి కీలకమైన కార్యకర్తల కమిటీలను ఏర్పాటు చేసి రెండు పార్టీల ప్రచార సరళి ఈ కమిటీల నాయకత్వం లో జరపాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.ఇకపై పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి కార్యక్రమాలను రూపొందించుకోవాలని ఈ భేటీ నిర్ణయించిందట.సీట్ల కేటాయింపులు కూడా తుదిదశకు వచ్చాయని ప్రచారం జరుగుతున్న దరిమిలా ఈ రెండు పార్టీలు ఎన్నికల కార్య క్షేత్రం లోకి అత్యంత వేగంగా దూసుకు రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube