తెలుగుదేశానికి ఒంటరి పోరే శరణ్యమా?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది .లేటుగా వచ్చినా లేటెస్ట్ గా దూకుడు చూపిస్తున్న జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది.

 Tdp Chandrababu Naidu To Fight Alone In 2024 Elections,tdp,chandrababu Naidu,202-TeluguStop.com

ముఖ్యమంత్రి పదవి( AP CM Post )పై ఒకప్పుడు కాస్త నిరాశక్తంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజ్యాధికారానికి జనసేన సిద్ధంగా ఉందని జనసేన ప్రభుత్వo( Janasena ) ఏర్పాటు అయితే చేయబోయే కార్యక్రమాలను ప్రకటించడం మొదలుపెట్టారు.తమ ప్రభుత్వం రాగానే ఆయా వర్గాలకు చేయబోయే మేలు ఏమిటో కూడా అనేక సభల్లో ఆయన చెబుతున్నారు .దీనిని బట్టి ప్రబుత్వ ఏర్పాటు లో జనసేన వాటా కోరుకోనుందని స్పష్టమైపోయింది .అంతేకాకుండా కేంద్ర భాజపా( BJP ) కూడా జనసేనకు అండగా నిలబడటానికి సిద్ధమైపోవటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో ఆల్టర్నేటివ్ రాజకీయ ఫోర్సుగా నిలబడడానికి జనసేన సిద్దమైపోయింది అని చెప్పాలి

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics

ఇప్పుడు జనసేన ఎదుగుదల తెలుగుదేశం పార్టీ( Telugudesam Party ) రాజకీయానికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తుంది.అయినప్పటికీ జగన్ తో హరా హరీ పోరాటానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితుల లో టిడిపి మీడియా కూడా ఉండటంతో ఇప్పుడు రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీ( Janasena vvs YCP ) గా మారిపోయాయి.దాంతో వార్తల లో టిడిపి ప్రాధాన్యత కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ తెలుగుదేశం వ్యూహాత్మకంగానే ఈ వాతావరణాన్ని పరిశీలిస్తుందని తెలుస్తుంది జనసేన వేగానికి కేంద్ర బిజెపి మద్దతు కూడా తోడవడంతో భారీ సీట్లు డిమాండ్ చేసే దిశగా జనసేన వ్యూహా రచన చేస్తుందని అంచనా వేస్తున్న తెలుగుదేశం పెద్దలు ఒంటరిగా వెళ్లడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics

ప్రభుత్వం వ్యతిరేకత భారీ స్థాయిలో పెరిగినందున కచ్చితంగా అది తెలుగుదేశానికి లాభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తెలుగుదేశం ఒంటరిగా ముందుకు వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అర్బన్ ఏరియాలో ఎలానో అధికార వైసిపి గ్రాఫ్ బాగా తగ్గింది కాబట్టి పల్లె వాతావరణంలోకి చొచ్చుకుపోగలిగితే రాజ్యాధికారానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న తెలుగుదేశం ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు చేయాలని భావిస్తుందట .ఒకవైపు లోకేష్ పాదయాత్ర( Lokesh Padayatra ) మరోవైపు తెలుగుదేశం అధినేత జిల్లాల పర్యటన లతో పూర్తిస్థాయిలో పార్టీని అన్నీ విదాలా బలపరచుకొని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా సిద్ధమవ్వాలని నాయకులకు పార్టీ అధినేత సూచించారని తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube