టిడిపి ది వ్యూహాత్మక మౌనమేనా ?

గత కొన్ని రోజులుగా జగన్ వర్సెస్ పవన్ గా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినేరియో( AP Political Scenario ) మారిపోయింది .తన వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ అధినేతను డైరెక్ట్గా టార్గెట్ చేసిన పవన్ వ్యాఖ్యలు అధికార పార్టీకి చాలా డ్యామేజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

 Chandrababu Naidu Political Strategy Behind Silence,tdp,ycp,janasena,chandrababu-TeluguStop.com

అధికారపక్ష వైఫల్యాలను సాక్షాదారాలతో సహా సమావేశాల్లో వివరిస్తున్న పవన్ , ప్రభుత్వం అనేక అంశాలలో ఫెయిల్ అయిందని మంత్రులు అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయింది అంటూ అనేక రకాల విమర్శలు ప్రభుత్వంపై చేశారు.దీనిపై అధికార పక్ష నేతలకు కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు.

అయితే ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా తెలుగుదేశం పార్టీ( Telugudesam Party ) సోదిలో కూడా లేకుండా పోయింది.జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర గాని ప్రతిపక్ష నేత చంద్రబాబు కార్యక్రమాలు గాని మీడియాలో ప్రచారానికి కూడా నోచుకోలేని స్థాయిలో పవన్ కార్యక్రమాలు హైలైట్ అవుతున్నాయి .

Telugu Ap, Chandrababu, Janasena, Strategy, Ys Jagan-Politics

ఇదంతా తెలుగుదేశం మీడియా వ్యూహాత్మకంగా చేస్తుందా లేక తెలుగు ప్రజల అటెన్షన్ మొత్తం ఇటువైపే ఉంది కాబట్టి దానిని క్యాష్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలోనే కవరేజిస్తుందా ? అన్నది కూడా అర్థం కానీ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొంది .అయితే తెలుగుదేశం అధినేత( TDP Leader Chandrababu Naidu ) తన అనుకూల మీడియాతో వ్యూహాత్మకంగానే పవన్ వ్యాఖ్యలకు భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారని తాము జగన్ పై చేసే విమర్శలకు ప్రజల నుంచి అంత స్పందన రావడం లేదని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సభలకు భారీ ఎత్తున స్పందన వస్తుంది, కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను పవన్ ద్వారా ప్రజల్లో ఎండగట్టి ఆ ఫలితాన్ని మాత్రం తమ పార్టీ వైపు మళ్ళించుకునేలా వ్యవహాత్మకంగా వ్యవహరించే ఉద్దేశంతోనే ఆయన తన అనుకూలం మీడియాతో ఇలా చేయిస్తున్నారని విశ్లేషణలు కూడా ఉన్నాయి

Telugu Ap, Chandrababu, Janasena, Strategy, Ys Jagan-Politics

అధికార పక్షo ఇమేజ్ పూర్తిగా తగ్గిన తరువాత వైసిపిని గద్దతించాలంటే తెలుగుదేశం వల్ల మాత్రమే అవుతుందన్న వాతావరణాన్ని తిరిగి క్రియేట్ చేస్తారని అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశానికి మల్లుతుందని అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరేవరకు పవన్ కు కవరేజ్ ఇవ్వాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube