ఎన్నికలలో ధన ప్రవాహం ఏదేచ్చగా పారుతున్న రోజులువి .అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే రోజులు పోయి డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తేనే ఓట్లు రాలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ( Political parties )కూడా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ జగన్( YS Jagan ) అమలు చేస్తున్న నగదు బదిలీ ఆ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ను తీసుకొచ్చిందని చెప్పాలి .అనేక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి మేలు జరిగేలా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆయా వర్గాలలో ఆ పార్టీకి అభిమానులు ఏర్పడ్డారు .
ఇప్పుడు ఆయా వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకొనే విరుగుడు మంత్రంగా కూడా నగదు బదలీ నే ప్రయోగించాలని తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .మహానాడు( Mahanadu ) వేదికగా ముగింపు వేడుకలలో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికలమొదటి మేనిఫెస్టో దానిని ప్రతిబింబించింది.ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు( Chandrababu ) ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని ప్రకటించిడం కొసమెరుపు .అమ్మకు వందనం పేరుతో ప్రతి ఆడబిడ్డకు 15 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని మాటిచ్చారు.
ముఖ్యంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఓడి పథకానికి టిడిపి వెర్షన్ గానే ఈ పథకాన్ని చూడాల్సి వస్తుంది.డైరెక్ట్ గా బటన్ నొక్కడం ద్వారా ఖాతాల్లో డబ్బులు ఇస్తున్న జగన్ ప్రభుత్వ వేగాన్ని అడ్డుకుని వోటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ట నగదు బదిలీలే సరైన విధానం అని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించినట్లుగా ఈ పథకాల రూపకల్పన చూస్తే తెలుస్తుంది.వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యంగా ఈ నగదు బదిలీ పథకాలు వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం విజయం లో కీ రోల్ ప్లే చేస్తాయని తెలుగు దేశం పార్టీ నమ్ముతుంది మరి చంద్రబాబు ప్రకటించిన పథకాల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో వచ్చే రోజుల్లో తెలుస్తుంది.