నగదు బదిలీలే తారక మంత్రమా?
TeluguStop.com
ఎన్నికలలో ధన ప్రవాహం ఏదేచ్చగా పారుతున్న రోజులువి .అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే రోజులు పోయి డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తేనే ఓట్లు రాలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ( Political Parties )కూడా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ జగన్( YS Jagan ) అమలు చేస్తున్న నగదు బదిలీ ఆ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ను తీసుకొచ్చిందని చెప్పాలి .
అనేక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి మేలు జరిగేలా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆయా వర్గాలలో ఆ పార్టీకి అభిమానులు ఏర్పడ్డారు .
"""/" /
ఇప్పుడు ఆయా వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకొనే విరుగుడు మంత్రంగా కూడా నగదు బదలీ నే ప్రయోగించాలని తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .
మహానాడు( Mahanadu ) వేదికగా ముగింపు వేడుకలలో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికలమొదటి మేనిఫెస్టో దానిని ప్రతిబింబించింది.
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు( Chandrababu ) ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని ప్రకటించిడం కొసమెరుపు .
అమ్మకు వందనం పేరుతో ప్రతి ఆడబిడ్డకు 15 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని మాటిచ్చారు.
"""/" /
ముఖ్యంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఓడి పథకానికి టిడిపి వెర్షన్ గానే ఈ పథకాన్ని చూడాల్సి వస్తుంది.
డైరెక్ట్ గా బటన్ నొక్కడం ద్వారా ఖాతాల్లో డబ్బులు ఇస్తున్న జగన్ ప్రభుత్వ వేగాన్ని అడ్డుకుని వోటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ట నగదు బదిలీలే సరైన విధానం అని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించినట్లుగా ఈ పథకాల రూపకల్పన చూస్తే తెలుస్తుంది.
వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యంగా ఈ నగదు బదిలీ పథకాలు వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం విజయం లో కీ రోల్ ప్లే చేస్తాయని తెలుగు దేశం పార్టీ నమ్ముతుంది మరి చంద్రబాబు ప్రకటించిన పథకాల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో వచ్చే రోజుల్లో తెలుస్తుంది.
వైరల్ వీడియో..చీనాబ్ రైల్వే వంతెనపై దూసుకెళ్లిన వందేభారత్..