తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన దర్శకులలో ఒకరిగా చెప్పుకునే డైరెక్టర్ గుణశేఖర్(gunasekhar ).33 ఏళ్ల కెరియర్లో కేవలం 13 సినిమాలు మాత్రమే తీశారు.దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక సినిమా తీయాలంటే దానికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణ చేసుకొని లోతుగా పరిశీలించి ఆ తర్వాతే మెగా ఫోన్ పట్టుకుంటారు.దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ లాఠీ ‘(lathi) తోనే అవార్డు అందుకున్న దర్శకుడు గుణశేఖర్.
రెండవ సినిమా సొగసు చూడ తరమా(Sogasu cuda tarama ) సినిమాకి సైతం ఆయనకు నంది వరించింది.ఇక మూడవ సినిమా గా బాల రామాయణం(Bala Ramayana) తెరకెక్కించారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr)ఇందులో రాముడిగా నటించారు ఈ సినిమాకి మంచి పేరు లభించడంతో పాటు నదులు కూడా వరించాయి.ఇలా రామాయణం తెరకెక్కించిన తర్వాత ఎవరైనా కమర్షియల్ సినిమా చేస్తారు అని ఊహిస్తారా కాని గుణశేఖర్ చేస్తాడు.అదే చూడాలని ఉంది చిత్రం.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత మనోహరం(manoharam ) అనే సినిమాకు గాని ఉత్తమ కథ రచయితగా కూడా గుణశేఖర్ నంది అవార్డు దక్కించుకున్నారు.ఇక చిరంజీవితో మృగరాజు(Mrigaraju Chiranjeevi) సినిమా తీయగా అది దారుణ పరాజయం చూసింది.
ఆ తర్వాత మహేష్ బాబు తో ఒక్కడు (Okkadu, Mahesh Babu)సినిమాను తెరకెక్కించారు గుణశేఖర్.ఈ సినిమాకు గాని ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.
అందులో 8 నంది అవార్డులు ఉండడం విశేషం.
ఈ సినిమా తర్వాత అర్జున్ సైనికుడు అనే మరో రెండు సినిమాలను మహేష్ బాబుతో గుణశేఖర్ తెరకెక్కించారు.ఇలా ఒకే దర్శకుడుతో మహేష్ బాబు మూడు సినిమాలు చేయడం ఇదే మొదటిసారి మరియు చివరిసారి.అల్లు అర్జున్ తో వరుడు(varuḍu ,Allu Arjun )అనే సినిమా కూడా తెరకెక్కించిన హీరోయిన్ ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టడంతో విపరీతమైన హైప్ పెరిగి సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత నిప్పు చిత్రం చేసిన అది కూడా పరాజయం పొందింది.ఇక రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా చరిత్ర పై ఫోకస్ చేసిన గుణశేఖర్ అనుష్కతో రుద్రమదేవి సినిమాలు తెరకెక్కించారు.కానీ ఈ సినిమాకి ఎవరు నిర్మాతగా ముందుకు రాకపోవడంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తీసి అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు.ఇందులో అల్లు అర్జున్ గోనె గన్నారెడ్డి గా నటించడం వల్లే సినిమా విజయం సాధించింది.
ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు గ్యాప్ తీసుకుని శాకుంతలం కూడా స్వీయ నిర్మాణంలో దొరకెక్కించగా అది డిజాస్టర్ అయ్యింది.