చార్మి కౌర్.( Charmi Kaur ).2002లో నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది చార్మి.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేటప్పుడు చార్మి వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే.2015 వరకు ఆమె వరుస పెట్టి సినిమాల్లో నటించింది అయితే హీరోయిన్ గా ఎంత పాపులర్ అయిందో గాసిప్స్ తో కూడా ఛార్మి అంతే పాపులర్ అయ్యింది.పూరి జగన్నాథ్( Puri Jagannath ) తో ఆమె వ్యవహారం మీడియా వరకు వచ్చింది.
సోషల్ మీడియాలో అయితే వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి.ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఛార్మి గురించి అందరూ మాట్లాడుకోవడం మానేశారు.
![Telugu Charmi Kaur, Double Ismart, Puri Jagannath, Tollywood-Telugu Top Posts Telugu Charmi Kaur, Double Ismart, Puri Jagannath, Tollywood-Telugu Top Posts](http://telugustop.com/wp-content/uploads/2024/06/Where-is-actress-charmi-Kaurc.jpg/)
ఆమె ఎక్కడా కనిపించడం లేదు.2015 నుంచి చార్మి పూర్తిగా నిర్మాతగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమాలకి మాత్రమే ఆమె కో- ప్రొడ్యూసర్ గా ఉన్నారు.ప్రస్తుతం వీరి నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ ( Double ismart )అనే సినిమా తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా కన్నా ముందే చార్మి మాట్లాడటం పూర్తిగా మీడియాతో మానేసింది.మీడియా ముందు ఎక్కడా కనిపించడం లేదు.విషయం ఏంటో తెలియదు కానీ సినిమాలు వరుసగా పరాజయాలు చవిచూస్తూనే ఉన్నాయి.ఆ ప్రభావం చార్మిపై గట్టిగా పడినట్టుగా కనిపిస్తుంది.
మీడియా ముందు ఎక్కువగా కనిపించడం వల్ల ఆ పూరి జగన్నాథ్ చార్మి మధ్యల వ్యవహారం గురించి మీడియా పూర్తి ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ వార్తలను వారి నుంచి దూరంగా పెట్టాలనుకుంటుంది.
![Telugu Charmi Kaur, Double Ismart, Puri Jagannath, Tollywood-Telugu Top Posts Telugu Charmi Kaur, Double Ismart, Puri Jagannath, Tollywood-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2024/06/Where-is-actress-charmi-Kaura-charmi.jpg)
చార్మి మరియు పూరి జగన్నాథ్ మధ్య కేవలం నిర్మాణ భాగస్వామ్యం మాత్రమే కాకుండా ఒక యాక్టింగ్ ఇనిస్ట్యూట్ కూడా ఉంది.మరి చార్మి డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం సాధించాకే మీడియా ముందుకు రావాలి అనుకుంటుందా లేకపోతే మరేమైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక తన యాక్టింగ్ కెరియర్ కూడా పూర్తిగా మానేసినట్టుగా చార్మి ప్రకటించడం విశేషం.
పెళ్లి కూడా చేసుకోకుండా పూరి జగన్నాథ్ తో సినిమాలు నిర్మిస్తూ జీవితాంతం బ్రహ్మచారి గానే ఉండేలా కనిపిస్తుంది.పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం తన పెళ్లి తన ఇష్టం అంటూ సమాధానం చెబుతుంది.