పవన్ కళ్యాణ్( Pawan Kalyan )… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు ఒక సంచలనం.కాదు కాదు కాదు కాదు ప్రభంజనం.
హలో ఏపీ బై బైసిపి అంటూ ప్రతి ఒక్కరి గుండెను తాకిన పవన్ కళ్యాణ్ రొమ్ము విరుచుకుంటూ తన విజయాన్ని అందరికీ తెలియజేశాడు.తనతో పాటు కూటమిని కూడా విజయ శిఖరాలకు నడిపించాడు.
అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సాధించింది ఏంటి ఆరోజు చిరంజీవి కోల్పోయింది ఏంటి అనేది.ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చాడు అలాగే అన్నను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఆరోజు ప్రజారాజ్యం ( Prajarajyam )యూత్ వింగ్ లో ఆక్టివ్ గా రాజకీయాలు చేశాడు.
![Telugu Ap, Chiranjeevi, Differencepawan, Janasena, Pawan Kalyan, Prajarajyam-Tel Telugu Ap, Chiranjeevi, Differencepawan, Janasena, Pawan Kalyan, Prajarajyam-Tel](https://telugustop.com/wp-content/uploads/2024/06/Difference-between-Pawan-Kalyan-and-chiranjeevic.jpg)
కానీ చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి ఒక స్పష్టమైన తేడా మాత్రం కనిపిస్తుంది.ఎన్టీఆర్ రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే లక్ష్యంతో పని చేశాడు.కానీ రాజకీయం సినిమా హిట్టు కొట్టినంత ఈజీ కాదు అనే విషయం చాలా త్వరగానే చిరంజీవికి అర్థమైంది.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ చిరంజీవి( Chiranjeevi ) పోటీ చేసిన కూడా కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది ఆ పార్టీ.
అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని చిరంజీవి చాలా త్వరగా పావులు కదిపాడు.
![Telugu Ap, Chiranjeevi, Differencepawan, Janasena, Pawan Kalyan, Prajarajyam-Tel Telugu Ap, Chiranjeevi, Differencepawan, Janasena, Pawan Kalyan, Prajarajyam-Tel](https://telugustop.com/wp-content/uploads/2024/06/Difference-between-Pawan-Kalyan-and-chiranjeevif.jpg)
తన ప్రజారాజ్యం పార్టీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసి ఐదేళ్లపాటు ఒక మినిస్ట్రీ మాత్రమే తీసుకొని ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలను గాలికి వదిలేసి మళ్లీ సినిమా జీవితానికి వచ్చేసాడు.కానీ పవన్ కళ్యాణ్ 22 కాదు కదా ఒకే ఒక్క సీట్ మాత్రమే 2019 ఎన్నికల్లో గెలుచుకున్నాడు.అయినా కూడా వెన్ను చూపకుండా మళ్ళీ ఐదేళ్లపాటు తాను ప్రతిక్షణం ప్రశ్నిస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు 2024 లో ఇది కదా పవన్ కళ్యాణ్ అని అందరికీ అర్థమయ్యేలా చేశాడు.పోటీ చేసిన ప్రతి చోటా విజయం సాధించాడు.బాబు తో కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా నడిపించబోతున్నారు.అన్న పార్టీని అమ్ముకుంటే తమ్ముడు ప్రజలను మాత్రమే నమ్ముకున్నాడు.
ఇదే వీరిద్దరి మధ్య ఉన్న అతిపెద్ద తేడా.చిరంజీవి సాధించలేనిది ఈరోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సాధించాడు.