రాజమౌళి సినిమా ఇండస్ట్రీకి రావడానికి పెద్ద కథ నే ఉంది.శాంతి నివాసం అనే సీరియల్ కి మొదట్లో దర్శకత్వం చేసిన రాజమౌళి (Rajamouli)ఆ తర్వాత రాఘవేంద్ర రావు బ్యానర్ (Raghavendra Rao Banner)లోనే స్థిరపడిపోయారు కొన్నాళ్ల పాటు.
శాంతి నివాసం సీరియల్ సైతం రాఘవేంద్ర రావు బ్యానర్ పైన తెరకెక్కింది అప్పట్లో.ఈ సీరియల్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు సినిమాలకు పని చేస్తూ వచ్చారు కొన్నాళ్ల పాటు రాజమౌళి.
అయితే తను తాను ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం వచ్చింది సింహాద్రి (Simhdri)సినిమాతోనే అంటాడు రాజమౌళి.మరి అంతకన్నా ముందే స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు కదా అని అనుమానం మీకు వచ్చింది కదా ? మరి ఆ కథ ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి స్టూడెంట్ నెంబర్ వన్ (Student number one)సినిమాకి డైరెక్టర్ గా రాజమౌళి పేరు అయితే ఉంది కానీ దానికి పూర్తిగా దర్శకత్వ పర్యవేక్షణ చేసింది మాత్రం రాఘవేంద్ర రావు అనే విషయం మన అందరికీ తెలిసిందే.అసలు తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ లకి ఏదో ఒక రకంగా ప్రొడ్యూసర్ ని సెట్ చేసి సినిమా అవకాశం వచ్చేలా చేస్తారు రాఘవేంద్ర రావు.అలాగే ఎంతో కొంత మొదటి సినిమా అంటే భయం ఉంటుంది కాబట్టి వారి పక్కనే ఉండి ఆ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు.మరి తనను నమ్ముకుని వచ్చిన నిర్మాతకు కూడా న్యాయం చేయాలి అనేది ఆయన వాదన.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విషయంలో కూడా పూర్తిగా రాఘవేంద్రరావు గారి (Raghavendra Rao)విజన్ కి తగ్గట్టుగానే సినిమా నిర్మాణం జరుపుకుంది.కానీ రాజమౌళి ఒక దర్శకుడిగా తన సినిమా విషయంలో సాటిస్ఫై అవ్వలేదు అనేది నిజం ఈ సినిమా తర్వాత తన తండ్రితో అసలు విషయం చెప్పగా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad)ఒక అద్భుతమైన కథ ఇస్తాను దర్శకత్వం చేయు అంటూ ప్రోత్సహించారు.దాంతో సింహాద్రి సినిమా రూపుదిద్దుతుంది వాస్తవానికి ఇప్పుడు కేజీఎఫ్ సలార్ అని చెప్పుకుంటున్నాం.కానీ అప్పట్లో సింహాద్రి సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ మరియు దుమ్ము దులిపింది.
దాంతో తనలో ఉన్న డైరెక్టర్ నీ కూడా నమ్మడం మొదలుపెట్టాడు రాజమౌళి.







